యముడికి మిస్డ్ కాల్..! నగరంలో రోడ్లపై పోకిరీల డేంజర్ స్టంట్స్

by Ramesh N |
యముడికి మిస్డ్ కాల్..! నగరంలో రోడ్లపై పోకిరీల డేంజర్ స్టంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ మధ్యకాలంలో బైకులపై యువత చిత్రవిచిత్రమైన చేష్టలు చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. ప్రేమికులు బైక్‌పై ముద్దులు పెట్టుకుంటూ.. నడిరోడ్డుపై రెచ్చిపోతుంటే.. కొంత మంది నడిరోడ్డుపై రాష్ డ్రైవింగ్ చేస్తూ.. ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో రోడ్లపై మళ్లీ పోకిరీలు డేంజర్ బైక్ స్టంట్స్ చేస్తున్నారు. ఆర్థరాత్రి సమయాల్లో రోడ్లపై స్టంట్స్ వేస్తూ.. ఇతర వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నారు.

సిటి బయట నుంచి నగరం నడిబోడ్డు వరకు పలు చోట్ల ఆకాతాయిలు బైక్‌లపై స్టంట్స్ వేస్తున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. స్టంట్స్ చేస్తున్న దృశ్యాలను కొంత మంది తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు. దీంతో వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తెలంగాణ పోలీసులకు ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేశారు. ఈ విధంగా స్టంట్స్ వేస్తే యముడికి మిస్డ్ కాల్ చేసినట్లేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed