TS Assembly : తొలి రోజే అసెంబ్లీకి నిరసన సెగ.. పోలీసుల ఉరుకులు, పరుగులు (ఫొటోలు)

by Nagaya |   ( Updated:2023-08-03 07:47:56.0  )
TS Assembly : తొలి రోజే అసెంబ్లీకి నిరసన సెగ.. పోలీసుల ఉరుకులు, పరుగులు (ఫొటోలు)
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజే నిరసన సెగ తగిలింది. ఉదయం 11:30 గంటలకు శాసన సభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మూడు రోజులపాటు కొనసాగుతాయని ప్రచారం జరుగుతున్న ఈ సమావేశాల్లో మొదటి రోజు ఎలాంటి చర్చలు జరగలేదు. దివంగత ఎమ్మెల్యే సాయన్న సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు.


అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఎలాంటి ఆందోళనలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టంగా బందోబస్త్ చేపట్టారు.


అయినా నిరుద్యోగులకు భృతి కల్పిస్తామని హామీ ఇచ్చి నేటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ప్లకార్డులతో అసెంబ్లీ ముందుకు దూసుకురావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.


ఈ సందర్భంగా నిరసనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆందోళన కారులను పోలీసులు వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించారు.











Advertisement

Next Story