నువ్వు AC ఫుల్ పెట్టుకొని ఇంట్లో బజ్జో కేటీఆర్!.. బల్మూరి వెంకట్ కౌంటర్

by Disha Web Desk 5 |
నువ్వు AC ఫుల్ పెట్టుకొని ఇంట్లో బజ్జో కేటీఆర్!.. బల్మూరి వెంకట్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కపట నీతికి మారుపేరు కాంగ్రెస్! అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన ట్వీట్ కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు. ఆ ట్వీట్ లో బల్మూరి వెంకట్ పేరు తీస్తూ.. కోర్టులో కేసులు వేసి పరీక్షలు రద్దు అవ్వడానికి కారణం అయ్యారని ప్రస్తావించారు. దానికి కౌంటర్ గా బల్మూరి వెంకట్ ట్వీట్ చేస్తూ.. తెలంగాణా ఏర్పడ్డాక మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, నువ్వు మీ నాన్న తెలంగాణ సమాజానికి ఒరగబెట్టింది ఏంటి కేటీఆర్?? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఇంట్లో కుర్చోబెట్టాక తెలంగాణ యువత గుర్తుకు వచ్చిందా!, గత పదేళ్లుగా గుర్తుకు రాలేదా యువత? అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి అయినా వాళ్లని కలిసిన పాపాన పోలేదు. ఇప్పుడు ఎగిరి గంతేస్తున్నావ్! అని దుయ్యబట్టారు.

అలాగే మొన్నటి మీ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో విద్యార్థుల మరియు యువత అంశం ఒక్కటి అయినా ఉందా?? అని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం అనే నినాదంతో 2014లోకి అధికారంలోకి వచ్చారని. గత పదేళ్ళలో ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారు. కానీ మీ ఇంటి నిండా ఉద్యోగాలే అని ఎద్దేవా చేశారు. మీరు ఇచ్చిన ప్రతీ నోటిఫికేషన్ లో చిక్కు ముడులే. నేను వేసినవి తప్పుడు కేసులు అయితే, న్యాయస్థానం ఎందుకు ఆ నోటిఫికేషన్ లను రద్దు చేస్తుందని, ఇప్పుడు నువ్వు ఎవ్వరినీ తప్పు పడుతున్నావ్ నన్నా లేక న్యాయస్థానాన్నా? MLA పదవిలో ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావో జర్ర చూసుకొని మాట్లాడాలని సూచించారు.

మరి పేపర్ లీకేజీ కీ ఏమంటావు? వాటికి కూడా నేనే కారణం అంటావా? లీకుల గురించి నోరు మెదిపితే ఎక్కడ నీ బాగోతం బయట పడ్తుంది అనీ తెలివిగా లీకేజీ ప్రస్తావన తీయట్లేదని తెలిపారు. మేము నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతీ హామికి కట్టుబడి ఉన్నాం. ఇది ప్రజా ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, ఇతర మంత్రులు ఇప్పటికీ ఎప్పటికీ యువతకు అందుబాటులోనే ఉన్నారు.. ఉంటారు. మునుపటి లాగా ప్రగతి భవన్ లో కంచెలు వేసే రోజులు పోయాయని పేర్కొన్నారు. అంతేగాక కేటీఆర్ నోరు జాగ్రత్త! నీ అహంకారమే నీకు శత్రువు అని ఇకనైన గుర్తెరుగు! తెలంగాణ ఉసురు పోసుకుంది నువ్వూ, నీ కుటుంబం! అందుకే మట్టి కొట్టుకుపోయారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికల వరకూ మీ పార్టీ ఉంటదా, పీకుతదా?? అంటే బయట టాకు. నేను మీలాగా కాదు కేటీఆర్! నిరుద్యోగులను నేను ఎప్పడి లాగానే కలుస్తున్నా, ఫోన్లో మాట్లాడుతున్నా, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నానని తెలిపారు. వారి సమస్యలు తెలుసుకోడానికి స్వయంగా వారి దగ్గరకే వెళ్ళాను, వెళ్తున్నా, వెళ్తూనే ఉంటా. మీలా నమ్మించి గొంతు కోసే రకం కాదని స్పష్టం చేశారు. చివరగా ఇదంతా కాదూ అంటూ.. నీకూ, నీ నాన్నకు తెలంగాణ యువత గురించీ మాట్లాడే హక్కు లేనే లేదని, తెలంగాణ యువత సమస్యల పరిష్కారం కోసం ప్రజా ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. తెలంగాణ యువత భవిష్యత్తు మా గ్యారంటీ! అని తేల్చి చెప్పారు. ఎండల వేడి వల్ల ఆగం అవుతున్నావ్, నువ్వు AC ఫుల్ పెట్టుకొని ఇంట్లో బజ్జో కేటీఆర్! అని బల్మూరి వెంకట్ వ్యంగ్యాంస్త్రాలు విసిరారు.


Next Story

Most Viewed