మొన్న నాగార్జున, నిన్న మోహన్ బాబు, నేడు అల్లు అర్జున్

by Pooja |
మొన్న నాగార్జున, నిన్న మోహన్ బాబు, నేడు అల్లు అర్జున్
X

దిశ, వెబ్‌డెస్క్: గతకొంత కాలంగా తెలుగు సినీ పరిశ్రమలో ఉహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన పెద్ద పెద్ద కుటుంబాలు సమస్యల్లో చిక్కుకుంటున్నాయి. ఇటీవల ఎన్ కన్వెన్షన్ విషయంతో పాటు మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యల వివాదంలో ఇప్పటికే అక్కినేని నాగార్జున (Nagarjuna) కుటుంబం వార్తల్లో నిలిచింది. కాగా నాగార్జున న్యాయపరంగా ముందుకెల్తున్నారు. ఇక మంచు కుటుంబం కూడా తగాదాలలో, జర్నలిస్టుపై దాడి ఘటనలో మంచు మోహన్ బాబు (Mohan Babu) వివాదాల్లో చిక్కుకున్నారు. తాజాగా సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సైతం అరెస్టు అయ్యారు. ఆ ఘటనతో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, సినీ నటులు, అభిమానులు స్పందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed