అవును.. నిజంగా కేసీఆర్ కు నోటీసులు ఇయ్యాల్సిందే!.. బీఆర్ఎస్ పార్టీ ట్వీట్

by Ramesh Goud |
అవును.. నిజంగా కేసీఆర్ కు నోటీసులు ఇయ్యాల్సిందే!.. బీఆర్ఎస్ పార్టీ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అవును.. నిజంగానే కేసీఆర్‌కి నోటీసులు ఇయ్యాలని, నిరాశ నిస్పృహలలో ఉన్న తెలంగాణ సమాజంలో చైతన్యం నింపి, ఉద్యమాన్ని భుజాన వేసుకుని రాష్ట్రాన్ని సాధించినందుకు కేసీఆర్‌కి నోటీసులు ఇయ్యాల్సిందే!! అని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. చత్తీస్ ఘడ్ విద్యుత్ కొనుగోళ్లపై మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు అని కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్ కు స్పందించిన బీఆర్ఎస్ తెలంగాణ కూడా ఎట్లా తెచ్చినవ్.. ఎందుకు తెచ్చినవ్ అని వివరణ కోరుతూ.. నోటీసులు పంపండి రేవంత్ రెడ్డి గారు అంటూ భావోద్వేగ ట్వీట్ చేసింది. వలసలతో ఎడారుల్లా మారుతున్న ప్రాంతాన్ని పచ్చని, పసిడి పంటలతో అగ్రస్థానంలో నిలిపినందుకు కేసీఆర్‌కి నోటీసులు ఇయ్యాల్సిందే!! అని, బిందెడు నీళ్ల కోసం అరిగోస పడుతుంటే ఇంటింటికి త్రాగునీళ్ల సౌకర్యం అందజేసినందుకు కేసీఆర్‌కి నోటీసులు ఇయ్యాల్సిందే!! అని, పింఛన్లు రెండొందలు నుండి రెండు వేలు చేసినందుకు, ఆడబిడ్డలకి కళ్యాణ లక్ష్మీ మొదలు కేసీఆర్ కిట్ల వరకు అందజేసినందకు కేసీఆర్‌కి నోటీసులు ఇయ్యాల్సిందే!! అని చెప్పుకొచ్చింది.

అలాగే తాంబాలాళ్ల మారిన చెరువుల పూడిక తీసి గ్రామాల్లో జీవం నింపి, కులవృత్తులకి ఆసరాగా నిలిచినందుకు కేసీఆర్‌కి నోటీసులు ఇయ్యాల్సిందే!! అని, 270 కోట్ల మొక్కలు నాటి అడవుల విస్తీర్ణం పెంచినందుకు, సాగునీటి ప్రాజెక్టులతో నీటి గోస తీర్చినందుకు, రిజర్వాయర్లు, చెరువులు నింపి భూగర్భ జలాలు పెంచినందుకు కేసీఆర్‌కి నోటీసులు ఇయ్యాల్సిందే!! అని, జిల్లాకో మెడికల్ కాలేజి పెట్టినందుకు, ఐటీలో అగ్రస్థానంలో నిలిపినందుకు, పెట్టుబడులకి, పరిశ్రమలకి రాష్ట్రాన్ని శాంతిభద్రతలలో మేటిగా నిలిపినందుకు కేసీఆర్‌కి నోటీసులు ఇయ్యాల్సిందే!! అని వ్యాఖ్యలు చేసింది. అంతేగాక దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల కరెంటు ఇచ్చినందుకు కేసీఆర్‌కి నోటీసులు ఇయ్యాల్సిందే!! అని, అన్నిటికంటే ముఖ్యంగా.. రైతులని కడుపులో పెట్టుకుని చూసుకుని, కంటికి రెప్పలా కాపాడుకున్నందుకు కేసీఆర్‌కి నోటీసులు ఇయ్యాల్సిందే!! అని, తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేసి.. తెలంగాణ కోసం జీవితమంతా ధారపోసిన కేసీఆర్‌కి నోటీసులు ఇయ్యాల్సిందే!! అని బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed