- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Yadagiri Gutta: యాదగిరి గుట్టలో ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు
దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు నుంచి ధనుర్మాస(Dhanurmasa) ఘడియలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రముఖ ఆలయాలకు ఉత్సవ శోభ రానుంది. దేవాలయాల్లో ధనుర్మాస ఉత్సవాలను (Dhanurmasa festivals) వైభోవేపేతంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో (Sri Lakshminarasimha Swamy temple)కూడా ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో యాదగిరి గుట్ట ఆలయం నందు ఈరోజు ఉదయం నుండి ధనుర్మాస ఉత్సవములు ప్రారంభం అయ్యాయని తెలిపారు. ఈ వేడుకలను డిసెంబర్ 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 13 వరకు 30 రోజుల పాటు అతి వైభవంగా నిర్వహించబడతాయని వివరించారు. అలాగే ప్రతిరోజు ఉదయం 5 గంటలకు తిరుప్పావై కార్యక్రమం (Thiruppavai program) నిర్వహించబడునని తెలిపారు. ఇక జనవరి 13 న గోదా కళ్యాణం(Goda Kalyanam), 14 న ఒడిబియ్యం కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ అధికారులు వెల్లడించారు.