- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్
దిశ, వెబ్ డెస్క్ : ఇకపై యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు కొండపై గల విష్ణు పుష్కరిణిలో సంకల్ప స్నానాలు చేసే అవకాశం కల్పించానున్నారు దేవస్థానం అధికారులు. ఇందుకోసం విష్ణు పుష్కరిణిని శుభ్రం చేసి, స్నానాలకు తగిన ఏర్పాట్లు చేసి ఆగస్టు 11వ తేదీ నుండి అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే పదేళ్ళ కింద యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తులు కొండపై గల పుష్కరిణిలోనే స్నానాలు ఆచరించి, దర్శనాలు చేసుకునేవారు. ప్రధానాలయ అభివృద్దిలో భాగంగా కొండకింద లక్ష్మీ పుష్కరిణిలో మాత్రమే స్నానాలు ఆచరించేందుకు ఏర్పాట్లు చేసి, కొండపై గల పుష్కరిణిలో స్నానాలు నిషేధించారు. అప్పటి నుండి భక్తులు కొండ కింద స్నానాలు చేసి పైకి వెళ్ళి దర్శనాలు చేసుకోవడం ఇబ్బందిగా ఉందని గుర్తించిన అధికారులు.. ఇకపై గతంలో మాదిరి భక్తులకు కొండపై పుష్కరిణిలో సంకల్ప స్నానాలు పునఃప్రారంభం చేస్తున్నారు. అయితే ఈ స్నాన సంకల్పాలను ఉచితంగా కాకుండా రూ.500 రుసుం గా నిర్ణయించారు. వీరికి స్వామివారి ప్రత్యేక దర్శనం, స్వామివారి లడ్డూ సదుపాయం కల్పించానున్నారు. టికెట్ లేని భక్తులకు పుష్కరిణిలో నీటిని తలపై చల్లుకునేందుకు మాత్రమే అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు.