- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కావాలా.. అయితే ఈ డీటైల్స్ రాసి మీటర్‌కు అతికించండి
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. కోసం అధికారులు సన్నాహాలు మొదలెట్టారు. ఈ క్రమంలోనే కరెంట్ బిల్లులు కొట్టే ఉద్యోగులకు సమాచారం తీసుకొని రావాలని అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. వినియోగదారుల నుంచి ఆధార్, రేషన్, ఫోన్ నంబర్లను సిబ్బంది నమోదు చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే విద్యుత్ బిల్లులు తీసేందుకు వచ్చేప్పుడు.. వారికి సహకరించాలని అధికారులు కూడా సూచిస్తున్నారు.
ఒక వేళ బిల్ తీసేందుకు వచ్చినప్పుడు.. ఇంట్లో వాళ్లు లేకుంటే ఇలా చేయాలని సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్‌గా మారింది. సమాచారం నమోదు చేసుకునేటప్పుడు ఇంటి యజమాని లేకున్నా.. ఆధార్, రేషన్, ఫోన్ నెంబర్లు ఉంటే సరిపోతుందని.. మీ మీ విద్యుత్ మీటర్ కు వాటిని రాసి అతికించి తమ సిబ్బందికి అతికించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ విద్యుత్ అధికారి వాట్సాప్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు రాష్ట్రంలోని వాట్సాప్ గ్రూప్‌లలో వైరల్ గా మారింది. కాగా దీనిపై విద్యుత్ అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.