Ganesh Nimajjanam 2024: సెప్టెంబర్ 17న సెలవు.. కానీ, ఆరోజు రావాల్సిందే

by Kavitha |   ( Updated:2024-09-14 03:53:57.0  )
Ganesh Nimajjanam 2024: సెప్టెంబర్ 17న సెలవు.. కానీ, ఆరోజు రావాల్సిందే
X

దిశ, వెబ్‌డెస్క్: జంట నగరాల్లో గణేష్ నిమజ్జనానికి ఎంత క్రేజ్ ఉంటుందో స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈ నిమజ్జాలను చూడటానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు క్యూ కడతారు. అంతేకాకుండా చిన్న నుంచి పెద్ద వినాయకుడి వరకు ఈ నిమజ్జనం కార్యక్రమాన్ని డీజెలతో ధూం ధాంగా సెలబ్రేట్ చేస్తారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17న మంగళవారం జంట నగరాలలైన హైదరాబాద్, సికింద్రబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ జీవో విడుదల చేసింది. ఇక ఆ రోజున సెలవు ఇస్తుండటంతో నవంబర్ 9న రెండో శనివారం వర్కింగ్ డేగా ప్రకటించినది. కాగా అక్టోబర్‌లో దసరా సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Next Story