- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Thummala: చేనేత కార్మికుల ఉపాధి పెంపునకు కృషి.. సమీక్షలో మంత్రి తుమ్మల
దిశ, డైనమిక్ బ్యూరో: చేనేత కార్మికుల ఉపాధి పెంపునకు కృషి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు(Minister Thummala Nageshwar Rao) అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయం(Telangana Secretariat)లో చేనేత, జౌళి శాఖలపై మంత్రి తుమ్మల సమీక్ష(Review) నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా శాఖల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్షలో వివిధ ప్రభుత్వ శాఖల నుండి ఇప్పటి వరకు టీజీసీవో(TGCO)కి వచ్చిన ఆర్డర్లు.. వాటి పురోగతి పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతేగాక ప్రభుత్వ శాఖలకు, కార్పొరేషన్లకు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమగు వస్త్రాన్ని తప్పనిసరిగా టెస్కో(TESCO) ద్వారా కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు. అలాగే 2025-26 సంవత్సరానికి అవసరమగు వస్త్ర ఇండెంట్‌ను టెస్కో వారికి నవంబర్ 15, 2024 లోగా సమర్పించాలని ఆదేశించారు. ఇక చేనేత కార్మికుల ఉపాధికి తోడ్పాటు అందించేందుకు అధికారులు కృషి చేయాలని తుమ్మల చెప్పారు.