‘మీకు నచ్చినట్లుగా మాట్లాడకుంటే అరెస్టు చేస్తారా?’

by Sathputhe Rajesh |
‘మీకు నచ్చినట్లుగా మాట్లాడకుంటే అరెస్టు చేస్తారా?’
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వానికి నచ్చినట్లుగా మాట్లాడకుంటే అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ మండిపడ్డారు. తీన్మార్ మల్లన్నతో పాటు మరికొంత మంది అరెస్టులో పోలీసుల తీరు శోచనీయం అన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం అరెస్ట్ చేయబోతున్న వ్యక్తికి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కారణాన్ని తెలపాల్సి ఉందని, అరెస్ట్ చేస్తున్నది ఎవరో గుర్తించే విధంగా పోలీసులు యూనిఫామ్ లేదా బ్యాడ్జి చూపించాల్సి ఉన్నా వీటిలో ఏ ఒక్కటీ పోలీసులు పాటించలేదని ధ్వజమెత్తారు.

తీన్మార్ మల్లన్నతో పాటు క్యూన్యూస్ సిబ్బంది అరెస్టును టీజేఎస్ ఖండిస్తోందని అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఓ వీడియోను రిలీజ్ చేసిన కోదండరామ్.. జర్నలిస్టులకు అభిప్రాయాలు చెప్పే స్వాతంత్ర్యం ఉంటుందని వారు చెప్పే అభిప్రాయాలు రుచించనంత మాత్రాన అక్రమంగా అరెస్టులు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఇది భావప్రకటన స్వేచ్ఛపై దాడిగా భావిస్తున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed