KTR : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటెందుకెయ్యాలె.. ట్విట్టర్‌లో కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

by Shiva |   ( Updated:2024-01-17 07:35:56.0  )
KTR : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటెందుకెయ్యాలె.. ట్విట్టర్‌లో కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో లోకసభ ఎన్నికల వేడి అప్పుడే రాజుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీ అధినేతలు మెజారిటీ ఎంపీ సీట్లను కైవసం చేసుకుంటామని స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. ప్రతి లోక్‌సభ్ సెగ్మెంట్‌లో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ఎన్నికలకు ఎలా సమాయత్తమవ్వాలో దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తన X(ట్విట్టర్) ఖాతాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ టీమ్ కేసీఆర్‌కు ఎందుకు ఓటు వేయాలి? అంటూ వినూత్న క్యాంపెయినింగ్‌కు తెర లేపారు. 16, 17వ లోక్‌సభ గణాంకాలను ఓ సారి పరిశీలిస్తే.. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు తెలంగాణ హక్కులు, ప్రయోజనాల కోసం అవిశ్రాతంగా పని చేశాని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని విధాలను ప్రశ్నించడం, డిమాండ్ చేయడంలో ఎంత బాగా పని చేశారో తెలుస్తుంది. 2014లో ప్రత్యేక రాష్ట్రం సాధించినప్పుడు తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక టీఆర్ఎస్ మాత్రమేనని గుర్తు చేశారు. 2024లో కూడా లోక్‌సభకు తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్ నుంచే ప్రాతినిధ్యం ఉందన్నారు. నాడు.. నేడు.. ఏనాడైనా.. తెలంగాణ గళం.. తెలంగాణ బలం.. తెలంగాణ దళం.. మనమే..అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed