- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR : పాలమూరు కన్నా మూసీపై ఎందుకింత ప్రేమ? రూ.లక్షా యాభై వేల కోట్లా!: కేటీఆర్
దిశ, డైనమిక్ బ్యూరో: మూసీ సుందరీకరణకే రూ.లక్షా యాభై వేల కోట్లా? పదిహేను పక్కన ఇన్ని సున్నాలా 15,000,000,000,000? అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. మూసీని అందంగా ముస్తాబు చేసేందుకు మొన్న.. 50 వేల కోట్లు అయిందన్నరు, నిన్న 70 వేల కోట్లు వెచ్చిస్తామన్నరు, నేడు లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామంటున్నరు.. అని సీఎం మాట్లాడిన వీడియో షేర్ చేశారు. తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు 80 వేల కోట్లయితేనే గల్లీ నుంచి ఢిల్లీదాకా కాంగ్రెస్ గగ్గోలు పెట్టిందన్నారు.
ఇంతకీ మూసీ ప్రాజెక్టుతోమురిసే రైతులెందురు, నిల్వ ఉంచే టీఎంసీలెన్ని, సాగులోకి వచ్చే ఎకరాలెన్ని, పెరిగే పంటల దిగుబడి ఎంత, తీర్చే పారిశ్రామిక అవసరాలెంత, కొత్తగా నిర్మించే భారీ రిజర్వాయర్లెన్ని..? అని ప్రశ్నించారు. పుట్టిన గడ్డపై మమకారం లేని ముఖ్యమంత్రికి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకన్నా మూసీ ప్రాజెక్టుపైనే ఎందుకింత మక్కువ అని ప్రశ్నించారు. చివరి దశలో ఉన్న ప్రాజెక్టును పక్కనపెట్టి, కోల్డ్ స్టోరేజీలోకి నెట్టి మూసీ చుట్టే ఎందుకింత మంత్రాంగం? అని ప్రశ్నించారు. లండన్ లోని థేమ్స్ లాగా మారుస్తామనే వ్యూహం వెనక థీమ్ ఏంటి ? గేమ్ ప్లాన్ ఏంటి ? అని
ముఖ్యమంత్రి గారు... మూడింతలు పెంచిన మూసీ అంచనా వ్యయం కాంగ్రెస్ ధనదాహానికి సజీవ సాక్ష్యమన్నారు. మూసీ ప్రాజెక్టును చేపట్టాల్సిందేనని, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాల్సిందేనని పేర్కొన్నారు. కానీ మాటల దశలోనే ఉన్న ప్రాజెక్టులో మూటలు పంచుకునే పని షురూ చేస్తే సహించమన్నారు. తట్టెడు మన్ను తీయకముందే.. కోట్లు తన్నుకుపోయే కుట్రకు తెరతీస్తే భరించమన్నారు. "మూసీ రివర్ ఫ్రంట్" పేరిట బ్యాక్ డోర్‌లో జరుగుతున్న బాగోతాన్ని తెలంగాణ సమాజం అనుక్షణం గమనిస్తోందన్నారు. కుంభకోణాల కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాతపెడుతుందని పేర్కొన్నారు.
====
https://x.com/KTRBRS/status/1814928711000732011