'సిసోడియాను అరెస్టు చేసిన.. కవితపై ప్రేమ ఎందుకు..?'

by Vinod kumar |   ( Updated:2023-10-04 15:12:23.0  )
సిసోడియాను అరెస్టు చేసిన.. కవితపై ప్రేమ ఎందుకు..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ డిప్యూటి సీఎం ను అరెస్టు చేసిన బీజేపీ సర్కార్.. ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్టు చేయలేకపోయిందని? ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జీ మానిక్ రావు థాక్రే ప్రశ్నించారు. బుధవారం గాంధీభవన్‌లో జరిగిన స్పోక్స్ పర్సన్స్ మీటింగ్‌కు ఆయన హజరయ్యారు. ఎన్నికల సమయంలో అధికార ప్రతినిధుల పాత్ర చాలా కీలకమని ఆయా నేతలకు సూచించారు.అధికార ప్రతినిధులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బీజేపీ, బీజేపీ అవినీతికి సంబందించిన అన్ని అంశాలను సరైన ఆధారాలతో ప్రజలకు వివరించాలన్నారు.

అన్ని రకాల కార్యక్రమాలను సామాజిక మద్యమాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా లలో పబ్లిసిటీ చేయాలన్నారు.కాంగ్రెస్ మేనిఫెస్టో లను, డిక్లరేషన్లు, గ్యారంటీలు ప్రజలకు చేరవేయడంలో అధికార ప్రతినిధులు చొరవ చూపాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక వైపు, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎమ్ మూడు పార్టీలు మరోవైపు ఉన్నాయని వివరించారు. ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ కూడా స్పష్టంగా చెప్పారన్నారు. ఆ మూడు పార్టీలతో కొట్లాడే దమ్ము కాంగ్రెస్‌లో ఉన్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చేందుకు మోడీ, కేసీఆర్ వివిధ రకాల ప్రయత్నాలు మొదలు పెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్,మీడియా కమిటీ చైర్మన్ కుసుమ కుమార్, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, మన్సూర్ అలీఖాన్, వార్ రూమ్ ఇంచార్జ్ రోహన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed