- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రశాంత్‌తో బండిసంజయ్.. వందల సార్లు ఎందుకు మాట్లాడారు..?
దిశ, తెలంగాణ బ్యూరో: టెన్త్ పేపర్‌లీకేజీలో అరెస్టైన ప్రశాంత్, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌తో వందల ఫోన్కాల్స్ఎందుకు? మాట్లాడారు? అని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉన్నదని కాంగ్రెస్సీనియర్నేత మల్లు రవి ప్రభుత్వాన్ని కోరారు. వాళ్లిద్దరి కాన్వర్జేషన్స్పై అనుమానం ఉన్నదన్నారు. గంటల వ్యవధిలోనే అన్ని కాల్స్చేయడం ఆశ్చర్యంగా ఉన్నదన్నారు.పోలీసులు అన్ని కోణాల్లో విచారించాల్సిన అవసరం ఉన్నదన్నారు. గాంధీ భవన్లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ..ప్రశాంత్,బండి ఫోన్లను పరిశీలించాల్సిన అవసరం ఉన్నదన్నారు.
అప్పుడే నిజాలు బయటకు వస్తాయన్నారు. ఇక రాష్ట్రంలో రాజకీయ డ్రామా రసకందాయకంగా నడుస్తోందన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్లీకేజ్లో రెండు వారాల తర్వాత చైర్మన్విచారించడం ఏందని? ప్రశ్నించారు. సిట్‌తో జాప్యం జరుగుతుందని, సీబీఐ ఎంక్వైరీ వేయాలని అఖిల పక్షం కోరిందని, కానీ సర్కార్ స్పందించలేదన్నారు. ఎగ్జామినేషన్ సిస్టంను పనిచేయించే వ్యవస్థ ప్రభుత్వం దగ్గర లేదని ఫైర్అయ్యారు. ప్రజా సమస్యలు పక్క దారి పట్టేందుకే బీఆర్ఎస్, బీజేపీలు కొత్త నాటకాన్ని తెరమీదకు తీసుకువచ్చాయన్నారు.