- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హౌసింగ్ కార్పొరేషన్ సౌజన్యంతో,న్యాక్ ఆధ్వర్యంలో మహిళా సంఘం సభ్యులకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి ప్రసంగించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరని,అందుకే వారికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంలో మహిళలను భాగస్వామ్యులను చేయాలనే ఉద్దేశ్యంతో నిపుణులు చేత 40 మంది మహిళలకు వారం రోజుల పాటు శిక్షణ ఇప్పిస్తూ 1800 రూపాయల స్టయిఫండ్,సర్టిఫికెట్ కూడా 'న్యాక్'ద్వారా అందిస్తుందని ఆయన అన్నారు. సిమెంట్ బ్రిక్స్(ఇటుకలు) తయారీ కోసం వారికి బ్యాంకులు,మహిళా సంఘాల ద్వారా రుణాలు అందించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి,డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ,సిజె బెనహర్,శ్రీనివాస్ యాదవ్,హౌసింగ్ కార్పొరేషన్ పిడి వైద్యం భాస్కర్,ఏఇ కుమార్,న్యాక్ శివ శంకర్,తహసీల్దార్ సుందర్ రావు తదితరులు పాల్గొన్నారు.