ఈ దేశంలో మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు?..కేటీఆర్ షాకింగ్ ఆన్సర్

by Prasad Jukanti |   ( Updated:2024-05-09 15:23:09.0  )
ఈ దేశంలో మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు?..కేటీఆర్ షాకింగ్ ఆన్సర్
X

దిశ, డైనమిక్ బ్యూరో:అసెంబ్లీ ఫలితాల తర్వాత ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బౌన్స్ బ్యాక్ కాబోతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 88 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ ఆ తర్వాత మూడు నెలలకే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ స్థానాల్లో ఓడిపాయమని ఇప్పుడు కాంగ్రెస్ విషయంలో ఇదే జరగబోతున్నదని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గురువారం ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ పలు ఆసక్తిర విషయాలు పంచుకున్నారు. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ 10 నుంచి 12 స్థానాలు గెలవబోతున్నదని చెప్పారు.

మోడీకి ప్రత్యామ్నాయం ఎవరంటే?:

ఈ దేశంలో మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు అనే చర్చ జరుగుతోంది. మోడీ లేదా రాహుల్ గాంధీ ఈ ఇద్దరి చూట్టే చర్చ నడుస్తోంది. కానీ 2014కు ముందు నరేంద్ర మోడీ ఎవరు? ప్రతిసారి మోడీనే గెలిపించడానికి మనం అధ్యక్ష తరహా పాలనలో లేము. ప్రజాస్వామ్యంలో ఉన్నామన్నారు. ఈ దేశంలో మోడీకి ప్రత్యామ్నాయం రాజ్యాంగమే అన్నారు. 2004 లోనూ ఇలాంటి చర్చే జరిగింది. వాజ్ పెయి కాకుంటే ఈ దేశాన్ని ఎవరు ముందుకు నడుపుతారనే చర్చ ముందుకు వచ్చింది. కానీ దేశ ప్రజలు తమ నిర్ణయం వ్యక్తం చేశారు. ఇప్పుడు మోడీ విషయంలోనూ ఇదే జరుగుతోందన్నారు. మోడీ కాకుండా ఇంకా చాలా మంది టాలెంట్ కలిగిన వారు ఉన్నారన్నారు. బీజేపీ 400 పార్ అంటూ ప్రాపగాండ క్రియేట్ చేస్తోందని విమర్శించారు. దేశంలో మార్పుకు సమయం ఆసన్నమైందన్నారు. తమ ప్రత్యర్థులు తమ జేబులో ఉండాలి లేదా జైల్లో ఉండాలి అనేలా బీజేపీ వ్యవహిస్తోందన్నారు. రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ బేకార్ అంటే రాహుల్ గాంధీ దీన్ని షాందార్ అంటూన్నారని, లిక్కర్ స్కామ్ జరగలేదని అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమమని రాహుల్ గాంధీ అంటుంటే రేవంత్ రెడ్డి లిక్కర్ స్కామ్ జరిగిందని కేసీఆర్ కూతురు అరెస్ట్ చేశారని అంటున్నారు. వీరిద్దరి మధ్య ఏకాభిప్రాయం లేదన్నారు.

ఆ విషయంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది:

బీజేపీ ఒక్కటే అనే అబద్దాన్ని ప్రచారం చేస్తున్నారని ఈ విషయంలో వీరు అసెంబ్లీ ఎన్నికల్లో పాక్షికంగా సక్సెస్ అయ్యారన్నారు. కానీ నిజం ఏంటంటే దేశం మొత్తం చేస్తుంటే బీజేపీని ఎదుర్కొంటున్నవి ప్రాంతీయ పార్టీలే అన్నారు. తెలంగాణలో బీజేపీని అడ్డుకున్నది బీఆర్ఎసేనని కాంగ్రెస్ కాదన్నారు. బెంగాల్ లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్, ఢిల్లీ, పంజాబ్ లో కేజ్రీవాల్, తెలంగాణలో కేసీఆర్ బీజేపీని నిలువరించారన్నారు. బీజేపీ చాలెంజ్ లను చెక్ పెట్టే పరిస్థితుల్లో కాంగ్రెస్ లేదన్నారు. ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ ఇతర ప్రాంతీయ పార్టీలు బీజేపీతో అంటకాగుతున్నాయని దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. తెలంగాణతో పాటు ఇతర చోట్ల ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నాలను బీజేపీ చేసిందని అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట్ల అలాంటి పనులు చేయలేదని ఆరోపించారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ కే దక్కాలా? రాహుల్ గాంధీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల పక్కగుండానే భారత్ జోడో యాత్ర నిర్వహించారు తప్ప ఆ రాష్ట్రాలకు వెళ్లలేదు. యూపీలో కాంగ్రెస్ సీరియస్ గా దృష్టి సారించడం లేదు. అక్కడ వారి పార్టీ గెలవకుండా దేశంలో అధికారంలోకి ఎలా వస్తారు? అని ప్రశ్నించారు.

Read More...

ఈ ఇద్దరు తోడు దొంగలను ఓడిద్దాం!.. బీఆర్ఎస్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

Advertisement

Next Story

Most Viewed