- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కవిత జంతర్‌మంతర్ దీక్షకు హాజరయ్యేదెవరు?
దిశ, తెలంగాణ బ్యూరో : చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో శుక్రవారం ఒక రోజు దీక్షను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టనున్నారు. సుమారు 16 బీజేపీయేతర ప్రతిపక్ష పార్టీలు ఈ సభలో పాల్గొంటున్నట్లు ఆమె సన్నిహితులు తెలిపారు. కానీ ఏయే పార్టీలు హాజరవుతాయనే పూర్తి వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు. ఆయా పార్టీల నేతలకు ఇప్పటికే ఆహ్వానం పంపిన కవిత ఢిల్లీలో మకాం వేసి దీక్ష నిర్వహణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గెస్టులను పిలవడం, పలు మహిళా సంఘాల, ప్రజా సంఘాల నేతలకు ఇన్విటేషన్ పంపే పనుల్లో మునిగిపోయారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ దీక్షకు తెలంగాణ జాగృతి, భారత్ జాగృతి తరఫున వేలాది మంది కార్యకర్తలు, వాలంటీర్లు హాజరవుతున్నారు. ఇప్పటికే కొద్దిమంది ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా మరికొద్దిమంది ఫ్లైట్, రైళ్ళ ద్వారా చేరుకోనున్నారు. లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖండించారు. ఈ ఘటనకు నిరసనగా మరో ఏడు పార్టీలకు చెందిన ఎనిమిది నేతలతో కలిసి ప్రధానికి జాయింట్ లెటర్ రాశారు. ఉద్దేశపూర్వకంగా విపక్షాలపై సీబీఐ, ఈడీ సంస్థలను ఉసిగొల్పి ప్రజాస్వామిక విలువలను కేంద్ర ప్రభుత్వం, బీజేపీ మంటగలుపుతున్నాయని, నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్నాయన్నారు.
ఇప్పుడు కల్వకుంట్ల కవిత తలపెట్టిన దీక్షకు ఈ ఎనిమిది పార్టీల నుంచి మద్దతు ఉంటుందా?.. గతంలో పార్లమెంటు ఉభయ సభల్లో ఈ బిల్లు చర్చకు వచ్చినప్పుడు మద్దతు పలికిన పార్టీలు ఇప్పుడు కవిత పిలుపునకు సానుకూలంగా స్పందిస్తాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీక్ష ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే ఈడీ ఆమెకు లిక్కర్ స్కామ్‌లో విచారించాలంటూ నోటీసు జారీచేసి హాజరు కావాల్సిందిగా తేదీని ఖరారు చేసింది. అనూహ్య పరిణామంతో కవిత ఈ సభపై ఏ మేరకు దృష్టి సారిస్తారనే చర్చలు మొదలయ్యాయి.
ఇవి కూడా చదవండి :