BRS ఓటమి.. ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా..?

by Satheesh |   ( Updated:2023-12-03 17:07:51.0  )
BRS ఓటమి.. ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా..? వచ్చినా రేవంత్ ముఖాన్ని చూస్తారా..? అనే చర్చ జరుగుతున్నది. ప్రతిపక్ష సభ్యడిగా కేసీఆర్ సభలోకి వచ్చేందుకు ఇష్టపడరని ప్రచారం జరుగుతున్నది. ఎందుకంటే పదేళ్ల పాటు సీఎంగా సభలో వ్యవహరించిన ఆయన ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు ఇష్టపడరని టాక్ ఉంది. అందులో కేసీఆర్‌తో అనేక అవమానాలను ఎదుర్కోన్న రేవంత్ సభలో ఉంటారు. ఆయన కచ్చితంగా కేసీఆర్ పట్ల కొంత సెటైర్‌గా వ్యవహరించే చాన్స్ ఉంటుంది. తన ఎదురుగానే తనపై విమర్శలు చేస్తే కేసీఆర్ సహించరని టాక్ ఉంది.

రేవంత్‌తో తలపడుతారా..?

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పరోక్షంగానో, ప్రత్యక్షంగానే కేసీఆర్ తీరుతో ఇబ్బందిపడ్డవారే ఉన్నారు. సభలోకి కేసీఆర్ వస్తున్నప్పుడో, ఆయన మాట్లాడే సమయంలోనైన సెటైర్లు వేసే చాన్స్ ఉంటుంది. అలాంటి సన్నివేశాలను కేసీఆర్ రిసీవ్ చేసుకోరని బీఆర్ఎస్ లీడర్లు అంటున్నారు. అందులో రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై మంచి కసి మీద ఉన్నారు. 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైన రేవంత్‌ను అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా సస్పెండ్ చేశారు. ఇప్పుడు రేవంత్ ఏ చిన్న అవకాశం వచ్చినా అసెంబ్లీ రూల్స్ ప్రకారం బీఆర్ఎస్ లీడర్లను కట్టడి చేసే చాన్స్ ఉంటుందనే టాక్ ఉంది. అందులో కేసీఆర్ కూడా ఉండే అవకాశం ఉండొచ్చని ప్రచారం జరుగుతున్నది.

ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా..?

అసెంబ్లీలోకి వచ్చి అవమానాలను ఎదుర్కోవడం కంటే, ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. లోకసభ ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసి, అక్కడ గెలిచిన తరవాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే టాక్ ఉంది. ఒకవేళ ఎంపీగా పోటీ చేయకున్నా ప్రత్యక్ష రాజకీయాలకు కేసీఆర్ గుడ్ బై చెప్పి, పార్టీ బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగించే చాన్స్ ఉందని ఊహగానాలు ఉన్నాయి.

Read More..

అహంకారమే ఓడించింది

బీఆర్ఎస్ కొంపముంచిన ఎమ్మెల్సీ కవిత..?

Advertisement

Next Story

Most Viewed