- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నగారా మోగింది.. అస్త్రం కరువైంది!
దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ నిన్న విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ బైపోల్‌కు సైతం మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే మెజార్టీ గెలుపు లక్ష్యంగా తెలంగాణలోని ప్రధాన పార్టీలైనా కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీలో మాత్రం తాజా రాజకీయల పరిమాణాలు వల్ల ఎన్నికల జోష్ కనిపించడం లేదని చర్చానీయాంశంగా మారింది.
బీఆర్ఎస్‌కు ప్రచారాస్త్రాలేవి?
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనా బీఆర్ఎస్ పార్టీకి ఈ లోక్‌సభ ఎన్నికల్లోను మెజార్టీ సీట్లు సాధించదని పలు సర్వేలు చెబుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి అస్త్రాలుగా చేసి ప్రచారం చేసింది. అయిన కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఎలాంటి అస్త్రాలు ఉపయోగించాలనే డైలామాలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ పార్టీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్, కాంగ్రెస్‌ను విమర్శిస్తూ.. అనేక అస్త్రాలతో ప్రచారంలో దూసుకుపోతున్నది. ప్రధాని మోడీ తెలంగాణ అభివృద్ధికోసం పాటుపడుతామని తాజాగా జరిగిన నాగర్‌కర్నూల్ సభలో హామీలు ఇచ్చారు. మరోవైపు రామమందిర నిర్మాణం, మోడీ చరిష్మాతో తెలంగాణ బీజేపీలో జోష్ పెరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా మరోసారి ఆరు గ్యారంటీలతో పాటు కేసీఆర్ అవినీతిపై ప్రచార సాధనాలుగా వాడుకోనుంది. ఇది మాత్రమే కాకుండా ప్రధాని మోడీ పాలన తీరుపై ప్రజల్లో ఎండగట్టనున్నట్లు సమాచారం. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఎంపీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.
కేసీఆర్ మౌనం వెనుక వ్యూహమేంటీ?
లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, గులాబీ బాస్ కూతురు కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు మాత్రమే కవిత అరెస్ట్ వ్యవహారం చూసుకుంటున్నారు. కవిత అరెస్ట్‌పై శ్రేణుల్లో అంతగా స్పందన లేనట్లు కన్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై అంతంత మాత్రమే బీఆర్ఎస్ పార్టీ నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సొంత కూతురు అరెస్ట్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఇప్పటికే మౌనంగానే ఉన్నారు. ఈ మౌనం వెనుక వ్యూహమేంటని ఎవరికీ అంతుచిక్కడం లేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికల డ్రామానే అని విమర్శలు చేస్తోంది.
నేతల వలసలతో గందరగోళంలో గులాబీ శ్రేణులు
బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల ముందు గడ్డు పరిస్థితి ఎదురైనట్లు తెలుస్తోంది. ఒకపక్క ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, మరోవైపు బీఆర్ఎస్ కీలక నేతలు బీజేపీ, కాంగ్రెస్‌లోకి జంప్ అవుతున్నారు. తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో గులాబీ శ్రేణులతో పాటు, అధిష్టానం గందరగోళంలో ఉన్నట్లు సమాచారం.