- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజీవ్ గాంధీకి, తెలంగాణకు సంబంధమేంటి: సోలంకి శ్రీనివాస్
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్.. ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెరపైకి తీసుకొచ్చిందని, అసలు తెలంగాణకు, రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు ఉన్న సంబంధమేంటని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ ప్రశ్నించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును కాంగ్రెస్ కార్యకర్తలే ఒప్పుకోరని ఆయన పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ మోసుకొచ్చిన విదేశీ భావజాలం దేశానికి పట్టిన దరిద్రమని సోలంకి మండిపడ్డారు. రేవంత్ పై రాజీవ్ గాంధీ కుటుంబం ఒత్తిడి ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ ఒత్తిడితోనే వారానికి రెండు, మూడు సార్లు సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్తున్నారని పేర్కొన్నారు. ఒక్క కుటుంబానికి భజన, ఊడిగం చేసేలా రాష్ట్రంలో పాలన కొనసాగుతుందని ఆయన ఫైరయ్యారు.
రేవంత్ పాలనపై దృష్టి సారించాలని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసిందని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. రుణమాఫీ అవ్వకపోవడంతో రైతాంగం నట్టేట మునిగిందన్నారు. ఆగస్టు 15 దాటి పది రోజులు పూర్తి కావస్తున్నా రైతులందరికీ రుణమాఫీ అవ్వలేదన్నారు. రుణమాఫీపై ఒక్కో మంత్రి ఒక్కోలా మాట్లాడుతున్నారని సోలంకి ఆగ్రహం వ్యక్తంచేశారు. కొత్తగా ఏర్పడే యూనివర్సిటీలను స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఉన్న విశ్వవిద్యాలయాల్లో టాయిలెట్స్‌కు డోర్లు కూడా లేవని, వాటిలో మౌలిక వసతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా కొత్తగా తీసుకొస్తామని చెప్పిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో చెప్పాలని సోలంకి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.