- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్‌లో మంత్రి కేటీఆర్ రోల్ ఏంటి?
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్‌లో మంత్రి కేటీఆర్ పాత్రపై జోరుగా చర్చ జరుగుతున్నది. పార్టీలో ఆయన రోల్ ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జరిగినా.. అధిష్టానం నుంచి స్పష్టత కరువైంది. ఇప్పటి వరకు ఆయనకు ఏ పదవీ ఇవ్వలేదు. అసలు ఇస్తారా? లేదా? అనే చర్చ కూడా జరుగుతున్నది. అంతేకాకుండా ట్విట్టర్ హ్యాండిల్ నుంచి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని కేటీఆర్ తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
స్పష్టత ఇవ్వని సీఎం
కేటీఆర్‌కు తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని కొందరు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఇస్తారని మరికొందరు చెబుతున్నారు. కాని దీనిపై సీఎం కేసీఆర్ ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఏపీకి అధ్యక్షుడిని నియమించినా తెలంగాణ ప్రెసిడెంట్‌ను ప్రకటించలేదు.
కీలక మీటింగ్‌లకు దూరం
పార్టీ పేరు బీఆర్ఎస్‌గా మారిన తర్వాత కేటీఆర్ కీలకమైన పార్టీ యాక్టివిటీస్‌కు దూరంగా ఉంటున్నారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందనే వాదనలు కూడా ఉన్నాయి. కావాలనే డుమ్మా కొట్టారనే చర్చ సైతం జరుగుతున్నది. ఢిల్లీలో పార్టీ ఆఫీసు ప్రారంభానికి కేటీఆర్ దూరంగా ఉన్నారు. ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌కు అప్పగించినప్పుడు వెళ్లలేదు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ తొలి ఆవిర్భావ పబ్లిక్ మీటింగ్‌కూ డుమ్మా కొట్టారు. దీంతో బీఆర్ఎస్ ఏర్పాటు కేటీఆర్‌కు ఇష్టం లేదా?అనే అనుమానాలు సైతం పార్టీ లీడర్లు వ్యక్తం చేస్తున్నారు.
Also Read....
తెలంగాణపై BJP 'త్రినేత్ర' వ్యుహాం.. ఇక రంగంలోకి నేరుగా ప్రధాని మోడీ..!