తమ్ముడు కోమటిరెడ్డి ఏం చేస్తున్నాడు? పార్టీ మారే వాళ్ళ‌పై కేసు వేస్తా.. కేఏపాల్ కామెంట్స్

by Ramesh N |
తమ్ముడు కోమటిరెడ్డి ఏం చేస్తున్నాడు? పార్టీ మారే వాళ్ళ‌పై కేసు వేస్తా.. కేఏపాల్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఒక పార్టీలో గెలిచి మరో పార్టీకి వెళితే వాళ్ళ పై తాను కేసు వేస్తానని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన నల్లగొండ కేంద్రం హోటల్ మనోరమలో మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ ప్రభుత్వం లో అభివృద్ధి కాలేదని, కాంగ్రెస్ నేతలు సైతం మాటలు చెబుతున్నారన్నారు. తాగునీటి సమస్య జిల్లాను ఇబ్బందులు పెడుతుంటే.. తమ్ముడు కోమటిరెడ్డి ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. రాష్ట్రంలో మంచి నీళ్లు ఇవ్వడం లేదు, కరెంట్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం కూలగొట్టాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయన్నారు. అలా జరిగితే ఉద్యమం జరుగుతుందని తెలిపారు. బీజేపీ ఈడీ పేరుతో బెదిరిస్తోందని, అవినీతి పరులు దేశంలో చాలా మంది ఉన్నారన్నారు. కేసీఆర్ పై 5 కేసులు వేసి గెలిచానని, కొత్త కట్టడాల పేరుతో ప్రజలకు నష్టం చేశారని వివరించారు.

నన్ను చంపడం కోసం, జైల్లో పెట్టడం కోసం కేసీఆర్, కేటీఆర్ కుట్రలు చేశారని ఆరోపించారు. అయిన ప్రాణం పోవద్దని హాస్పిటల్ లో కేసీఆర్ ఉన్నప్పుడు తను దీవించి వచ్చారని గుర్తుచేశారు. తనను చంపాలనుకున్న వాళ్ళు నరకానికి పోయారని, సొంత అన్నయ్య చంపాలనుకున్నారని తర్వాత అతనే చనిపోయాడని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి తమ్ముడు సభ పెడతా అంటే తాను మద్దతుగా నిలిచాని తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని తక్కువకు అమ్మాలని చూస్తున్నారని, ఈ వ్యవహారంపై ప్రజల కోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. డ్రగ్స్‌తో యువత తప్పుదోవ పడుతుందని, నాయకులు ఈ కేసులో ఉన్నారన్నారు. తన మాటలు గాలికి వదిలేయవద్దని, తాను వాస్తవాలు మాట్లాడుతున్నారని తెలిపారు.

Advertisement

Next Story