- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్టాండ్ ఏంటి..? మంత్రి KTR
దిశ, డైనమిక్ బ్యూరో: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రగతి భవన్‌ను పేల్చేయాలంటూ రేవంత్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్‌ను బాంబులతో పేల్చేయాలనడం ఒక సిద్ధాంతమా ఇది కాంగ్రెస్ పార్టీ వైఖరా అని ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అలా మాట్లాడవచ్చా అని నిలదీశారు. సీఎం ఎవరైతే వాళ్లు ప్రగతి భవన్‌లో ఉంటారని అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎల్పీ స్టాండ్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ధరణి విషయంలోనూ కాంగ్రెస్ అసంబద్ధంగా మాట్లాడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల నోటి వెంట పాజిటివ్ మాటలు రావడం లేదని.. అందువల్లే ఆ పార్టీ ఎక్కడా కాకుండా పోతోందని అన్నారు. కాంగ్రెస్ నాయకులను ప్రజలు పట్టించుకోవడం లేదని ఇకనైనా వారి వైఖరి మార్చుకోవాలని సూచించారు.