మౌనమేలనోయి..! ఏ సైలెంట్ లవ్ స్టోరీ!

by Ramesh N |
మౌనమేలనోయి..! ఏ సైలెంట్ లవ్ స్టోరీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: లిక్కర్ స్కామ్‌ ఆరోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిన్న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ శనివారం సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేసింది. ఎమ్మెల్సీ కవిత అరెస్టును మాజీ సీఎం కేసీఆర్‌ ఖండించలేదని తెలిపింది. ఆయన మౌనాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆమె అరెస్టుపై కేసీఆర్‌, నరేంద్ర మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు? దాని వెనుక వ్యూహం ఏంటి? అని ప్రశ్నించింది.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. మౌనమేలనోయి..! ఏ సైలెంట్ లవ్ స్టోరీ.. అయినా.. సింపతీ రాజకీయాలతో సీట్లు రావు సామీ అని తెలంగాణ కాంగ్రెస్ కేసీఆర్, మోడీలను విమర్శించింది.

Advertisement

Next Story

Most Viewed