CPI Narayana :వైద్యురాలి ఘటనలో మమతా బెనర్జీని దోషిగానే చూస్తాం .. సీపీఐ నారాయణ వ్యాఖ్యలు

by Ramesh N |
CPI Narayana :వైద్యురాలి ఘటనలో మమతా బెనర్జీని దోషిగానే చూస్తాం .. సీపీఐ నారాయణ వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో మహిళలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇవాళ హనుమకొండలో సీపీఐ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కోల్‌కత్త వైద్యురాలి ఘటనలో మమత బెనర్జీని దోషిగానే చూస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఆమె నైతిక బాధ్యత వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. బీహార్‌లో రూలింగ్ పార్టీకి చెందిన వ్యక్తులు ఒక యువతిపై అత్యాచారం చేశారని, మహారాష్ట్రలో ఐదేళ్ల చిన్నారిని లైంగిక దాడి చేశారని వెల్లడించారు.

ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నట్లు నారాయణ ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పాజిటీవ్‌గా ఉన్నారని తెలిపారు. కానీ బీఆర్ఎస్ వాళ్లు బీజేపీలో కలుస్తారని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, మరోవైపు బీఆర్ఎస్ వాళ్లేమో రేవంత్ రెడ్డి బీజేపీతో కలుస్తారని చెబుతున్నారని, బీజేపీ ఏమో వీరిపై మాట్లడుతుందన్నారు. ఒక పార్టీ వారు ఇంకో పార్టీని నామినేట్ చేస్తున్నారని ఇది విచిత్రమైన వాదన చేస్తున్నారని అన్నారు. ఎందుకంటే ఏదైతే ఇష్యూలను డైవర్ట్ చేసి పొలిటికల్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed