ప్రాణహిత చేవెళ్ళతో అదిలాబాద్ కు నీళ్ళిస్తాం :CM Revanth Reddy

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-05 11:18:01.0  )
ప్రాణహిత చేవెళ్ళతో అదిలాబాద్ కు నీళ్ళిస్తాం :CM Revanth Reddy
X

దిశ, వెబ్ డెస్క్ : దివంగత వెంకటస్వామి(కాకా) సూచన మేరకు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు గతంలో పెట్టారని..ఆయన ఆశయ సాధనకు తుమ్మిడిహెట్టి వద్ద ఆ ప్రాజెక్టును నిర్మించి అదిలాబాద్ జిల్లాకు సాగుతాగునీరు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆరెఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళను కాళేశ్వరంగా పేరు మార్చి లక్ష కోట్లు పెట్టి మన కండ్ల ముందే కట్టడం..కూలడం జరిగిందన్నారు. ఒకవేళ ఇవ్వాళ వాళ్ళే ఉంటే కూలిపోయిన దాన్ని ఎత్తిపోవడానికి మళ్ళీ 10వేల కోట్లు అదే కాంట్రాక్టర్ కు ఇచ్చి దిగమింగేవారన్నారు. రవీంద్రభారతిలో నిర్వహించిన వెంకటస్వామి జయంతి సభలో రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. పేదల కోసం పనిచేసిన వెంకటస్వామి స్ఫూర్తితో మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందన్నారు. ఫామ్ హౌస్ లను కాపాడేందుకు మూసీ నిర్వాసితులను రక్షణ కవచంగా వాడుకునే వారి రెచ్చగొట్టే మాటలు నమ్మకుండా మా ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకోవాలన్నారు.

మూసీ నిర్వాసిత పేదలను ఆదుకునేందుకు కేటీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ లు తగిన సూచనలివ్వాలన్నారు. 1500కోట్ల బీఆర్ఎస్ పార్టీ నిధిలో 500కోట్లు ఇవ్వండని, గజ్వెల్ లో కేసీఆర్ 1000ఎకరాల్లో 500ఎకరాల భూధానం చేయమని, కేటీఆర్ కు జన్వాడ ఫామ్ హౌజ్ లో ఉన్న 50ఎకరాల్లో 25ఎకరాలు ఇస్తే పేదలకు ఇండ్లు కట్టించే బాధ్యత నాదేనన్నారు. తెలంగాణ ఉద్యమంలో పిల్లల ప్రాణాలు పోతే రాష్ర్టం వచ్చాకా కేటీఆర్, కేసీఆర్, హరీశ్ ల ఆస్తులు గుట్టలోలే పెరిగిపోయాయన్నారు. పేదలకు ఇళ్ళ కోసం అవసరమైతే మలక్ పేట రేస్ కోర్సును, అంబర్ పేట పోలీస్ అకాడమీని సిటీ బయటకు తరలిస్తామని, మీరు వచ్చి సూచనలియండన్నారు. మీ అందరితే కమిటీ వేస్తామని సలహాలవ్వాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed