- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dy CM Bhatti Vikramarka : పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాము
దిశ, వెబ్‌డెస్క్: తన పాదయాత్రలో పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాను అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో సుమారు 85 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ.. 2023 ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్ర ప్రజల మనసులను గెలుచుకునే విధంగా ప్రజా ప్రభుత్వ విధానంతో పని చేస్తుందని అన్నారు. అలాగే ప్రజలు కోరుకున్న తెలంగాణ లక్ష్యాలను చట్టాలుగా చేసి ప్రజా ప్రభుత్వం పాలన అందిస్తుందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయించామని అన్నారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 9నెలల్లోనే పెద్దపల్లి జిల్లాలో సుమారు 11 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధికి బాటలు వేస్తున్నామని.. పెద్దపల్లి ప్రజల చిరకాల కోరిక పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని, పత్తిపాక రిజర్వాయర్ పూర్తి చేస్తామని తన పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి చెప్పుకొచ్చారు.