ఆయన రాక కోసమే మా ఎదురుచూపు.. కేసీఆర్​కు ఎంపీ ‘చామల’ కౌంటర్​

by Ramesh Goud |
ఆయన రాక కోసమే మా ఎదురుచూపు.. కేసీఆర్​కు ఎంపీ ‘చామల’ కౌంటర్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్​రాక కోసం తామంతా ఎదురుచూస్తున్నామని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి అన్నారు. శనివారం గాంధీ భవన్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి అసెంబ్లీలో కాంగ్రెస్​ను ఎండగడుతామన్న మాటలపై కేసీఆర్​కు కౌంటర్​ఇచ్చారు. ఆయన వస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.

‘‘కేసీఆర్ ఫాం హౌస్ లో కార్యకర్తల తో మాట్లాడుతూ.. ఓపిక నశించింది.. కాంగ్రెస్ ను అసెంబ్లీ కి వచ్చి ఎండగడుతా అంటున్నారు,’’అని ఎంపీ తెలిపారు. నిజానికి తాము ఎప్పడి నుంచి కేసీఆర్ రాక కోసం వేచి చూస్తున్నామని ఈసందర్భంగా పేర్కొన్నారు. ఆయన దౌర్భాగ్య పాలన ఫలితమే ఇదని విమర్శించారు. బీఆర్ఎస్​తప్పులు మాఫీ చేసే అక్షయ పాత్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఊహాగానాల తో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజా పాలన లో ప్రజలు మంత్రులను స్వేచ్ఛగా కలిసే అవకాశం ఉందని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం​మాదిరి తాము ఎవరిని అడ్డుకోబోమని ఈసందర్భంగా ఎంపీ చామల కిరణ్​ కుమార్​రెడ్డి స్పష్టం చేశారు.

Next Story