Rain Alert:తెలంగాణ ప్రజలకు హెచ్చరిక..రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

by Jakkula Mamatha |
Rain Alert:తెలంగాణ ప్రజలకు హెచ్చరిక..రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గత రెండు మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు రేపు(గురువారం) పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో మరో రెండు మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ వద్ద అల్పపీడనం ఏర్పడి అది ప్రజెంట్ తూర్పు మధ్యప్రదేశ్‌ మీదుగా కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఈ క్రమంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, ములుగు, వరంగల్, హన్మకొండ జనగాం, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ క్రమంలో రైతులు, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు.



Next Story