బోనో ఫిక్స్ మత్తులో యువత.. మత్తు కోసం కొత్త దారి..

by Disha News Web Desk |
బోనో ఫిక్స్ మత్తులో యువత.. మత్తు కోసం కొత్త దారి..
X

దిశ, పరకాల: పరకాల కేంద్రంగా యువత మత్తు కోసం కొత్త దారులు తొక్కుతోంది. గత కొంత కాలంగా గంజాయి, గుట్కా, తంబాకు, హెరాయిన్ తదితర మాదకద్రవ్యాలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాదకద్రవ్యాల సరఫరా ఈ ప్రాంతంలో నిలిచిపోయింది. దీనితో ఇప్పటికే వాటికి అలవాటు పడిన యువత మత్తు కోసం కొత్త దారులు వెతుకుతోంది. అందులో భాగంగా టైర్ల పంచర్లు అతికించడానికి ఉపయోగించే బోనో ఫిక్స్‌ను మత్తు పదార్ధంగా వాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పరకాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంగా అనేక అంశాలు వెలుగులోకి రావడం గమనార్హం. విశ్వసనీయ సమాచారం మేరకు దిశ పత్రిక ప్రతినిధి కాలేజీ గ్రౌండ్ పరిసరాలను పరిశీలించగా.. యువత పాలిథీన్ కవర్స్‌లో బోనో ఫిక్స్‌ రబ్ చేస్తూ శ్వాస ద్వారా పీలుస్తూ మత్తులో తేలియాడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పరకాల పోలీసులు పలు బుక్ సెంటర్‌లు, సైకిల్ షాప్ యాజమాన్యాలకు బోనో ఫిక్స్‌ అమ్మకాల కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికి ఈ తరహా వ్యవహారాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. పోలీస్ అధికారులు దృష్టి పెట్టి బోనో ఫిక్స్ మత్తును అరికట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.



Advertisement

Next Story

Most Viewed