- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శారీరక, మానసిక ఆరోగ్య రక్షణకు, ఒత్తిడి నివారణకు యోగా చాలా ఉపయోగం : జిల్లా కలెక్టర్
దిశ,హనుమకొండ టౌన్ : శారీరక, మానసిక ఆరోగ్య రక్షణకు, ఒత్తిడి నివారణకు యోగా చాలా ఉపయోగం ఉంటుంది అని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం 10 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్ సముదాయంలో జిల్లా ఆయుష్, యువజన క్రీడల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో యోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ శారీరక, మానసిక ఆరోగ్య రక్షణకు, ఒత్తిడి నివారణకు యోగా చాలా ఉపయోగపడుతుందని అన్నారు. యోగాను రోజువారీ జీవన విధానంలో భాగంగా చేసుకోవాలని, రోజు క్రమం తప్పకుండా యోగా చేస్తే రోగాలు రావని ఉన్న రోగాలు నయం అవుతావని తెలిపారు. యోగా విశిష్టతను ప్రపంచ దేశాలు గుర్తించాయని అన్నారు. రోజు పది నిమిషాలు ధ్యానం చేస్తే రోజంతా మానసికంగా శారీరకంగా హుషారుగా ఉంటారని, ఇది పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా ముఖ్యమని అన్నారు.
యోగాలో భాగంగా ప్రాణాయామం, ధ్యానం రోజు చేయాలని అన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ యోగా ప్రాముఖ్యత, ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచ స్థాయిలో యోగా పై ప్రజలకు అవగాహన కల్పించడం, దీనిని జీవనశైలిలో భాగం చేసుకునేలా ప్రజలను ప్రేరేపించడం దీని ప్రధాన లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి, హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, ఆయుష్ ఆర్జెడి రవి నాయక్ , ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు ఈ.వి. శ్రీనివాస రావు, జిల్లా అధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.