- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ విచిత్ర ఆకారాలు ఏంటి ?
by Sridhar Babu |
X
దిశ,డోర్నకల్ : డోర్నకల్ పట్టణ కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ వింత ఆకారం సీసీ కెమెరాకు చిక్కింది. దీనిపై ఎవరికి తోచింది వారు ప్రచారం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ వ్యాపారి, కాంగ్రెస్ నాయకులు మాదా శ్రీనివాస్ కూరగాయల మార్కెట్ వద్ద సీసీ కెమెరాలో ఓ వింత ఆకారం నిక్షిప్తమైంది. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ఈ దృశ్యం కనిపించింది.
రోజు మాదిరిగా ఉదయం మాదా శ్రీనివాస్ సీసీ కెమెరాలు పరిశీలిస్తుండగా ఈ ఆకారాలు కంటపడ్డాయి. అందులో మసీదు వద్ద పైనుంచి ఓ తెల్లని ఆకారం, అందులో మనిషి లాంటి కదిలే నీడ కనిపించాయి. కొందరు అవి గ్రహాంతరవాసులు (ఏలియన్స్) అని ప్రచారం చేస్తుండగా, మరికొందరు సీసీ కెమెరాలో టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇలా జరిగి ఉండవచ్చు అని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా పట్టణంలో ఏ నోట విన్నా ఇదే మాట వినిపిస్తుంది.
Advertisement
- Tags
- strange shapes
Next Story