మేము ప్రమాణస్వీకారం చేయం : మార్కెట్ కమీటీ వైస్ చైర్మన్ రవి

by samatah |
మేము ప్రమాణస్వీకారం చేయం : మార్కెట్ కమీటీ వైస్ చైర్మన్ రవి
X

దిశ,మహబూబాబాద్ ప్రతినిధి : మహాబూబాబాద్ జిల్లా లోని కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో వైస్ చైర్మన్ రవి‌తో పాటు డోర్నకల్ నియోజకవర్గం కు చెందిన పలువురు డైరెక్టర్‌లు వేదిక ఎదుట కూర్చుని నిరసన తెలిపారు. సోమవారం జరుగుతున్న నూతన పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమంలో భాగంగా వేదిక పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ‌లో ఎమ్మెల్యే రెడ్యా నాయక్, ఫోటోలు లేవని నిరసన తెలిపారు. తాము ప్రమాణస్వీకారం చేయమని, ప్రోగ్రాం వాయిదా వేయాలని డిమాండ్ చేశారు .రూరల్ సీఐ రమేష్ నాయక్,కేసముద్రం మండల ఎంపీపీ ఒలం చంద్ర మోహన్ కలుగజేసుకొని నచ్చజెప్పారు.వెంటనే రెడ్యా ఫ్లెక్సీ ని ఏర్పాటు చేయగా శాంతించారు. దింతో కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుంది.

Advertisement

Next Story