ఆ ప్రక‌ట‌న‌తో మాకు సంబంధం లేదు..!

by Kalyani |
ఆ ప్రక‌ట‌న‌తో మాకు సంబంధం లేదు..!
X

దిశ, ఏటూరునాగారం: ఏప్రిల్ 3వ తేదీన కొంత మంది బీఆర్ఎస్ నాయ‌కుల‌ను హెచ్చరిస్తూ ఏటూరు నాగారం ప‌రిధిలో మావోయిస్టు లేఖ క‌ల‌క‌లం సృష్టించింది. అయితే తాజాగా గురువారం భార‌త క‌మ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కార్యదర్శి వెంక‌టేశ్ ఆ ప్రకటనకు మాకు ఎలాంటి సంబంధం లేద‌ని కొంత మంది కావాల‌నే వ్యక్తిగత కార‌ణాల వ‌ల‌న న‌కీలీ లేఖ‌ల‌ను సృష్టించార‌ని ఒక‌ ప్రక‌ట‌న ద్వారా తెలిపారు. కొంత మంది ఆధికార పార్టీ చెందిన వారు న‌కీలీ పోస్టర్లు వేశార‌ని వారిలో కొంత మంది ప్రజా వ్యతిరేకులు కూడా ఉన్నార‌ని ప్రక‌ట‌న‌లో పేర్కొన్నారు. కాగా ఇలాంటి నకీలి పోస్టర్లను ప్రజ‌లు నమ్మకూడ‌ద‌ని ప్రక‌ట‌న‌లో కోరారు.

Advertisement

Next Story