ఉచిత కుట్టు మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోండి..

by Kalyani |
ఉచిత కుట్టు మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోండి..
X

దిశ, కార్వాన్ : తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీస్ కార్పొరేషన్ హైదరాబాద్ ద్వారా జిల్లాలోని పేదలు, నిరుద్యోగులు, అర్హులైన, శిక్షణ పొందిన మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద ఉచిత కుట్టు మిషన్లు పొందేందుకు అర్హులైన వారు జనవరి 20 లోగా దరఖాస్తులను సమర్పించాలని హైదరాబాద్ జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఇలియాజ్ అహ్మద్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. క్రిస్టియన్ మైనార్టీ మహిళ దరఖాస్తుదారులు వారి అర్హత ప్రమాణాల ప్రకారం జనవరి 4 నుండి జనవరి 20 తేదీ లోగా దరఖాస్తులను tgobmms. cgg. gov. ఇన్ వెబ్ సైట్ లో సమర్పించాలని ఆయన తెలిపారు.

నిరుద్యోగ క్రైస్తవ మైనార్టీ మహిళా సంఘం పేద ,నిరుపేద, విడాకులు పొందిన వితంతువులు, అనాధలు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత మేరకు ఈ పథకం అందజేయడం జరుగుతుందన్నారు. రేషన్ కార్డు,ఆహార భద్రత కార్డు ఉండాలని లేని పక్షంలో ఆదాయ ధ్రువీకరణ పత్రం ఉండాలన్నారు. అభ్యర్థి, తల్లిదండ్రుల సంరక్షకుల వార్షిక ఆదాయం రూ. 2 లక్షలకు తక్కువగా ఉండాలని తెలిపారు. దరఖాస్తుదారు వయస్సు 18 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలని, రుజువుకు ఓటర్ ఐడి, ఆధార్ కార్డు ఉన్న వారి ఇంటికి ఒక ఒక కుట్టు మిషన్ ఇవ్వబడుతుందన్నారు. అభ్యర్థి తప్పనిసరిగా ప్రభుత్వం ద్వారా టైలరింగ్ కోర్సులో శిక్షణ సంస్థలో గుర్తింపు పొందిన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలన్నారు. వీటితో పాటు కనీస విద్యార్హత 5 తరగతి ఉండాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed