Jallikattu : మధురైలో భారీ ఎత్తున జల్లికట్టు ఉత్సవం

by M.Rajitha |
Jallikattu : మధురైలో భారీ ఎత్తున జల్లికట్టు ఉత్సవం
X

దిశ, వెబ్ డెస్క్ : సంక్రాంతి పండుగ(Sankranthi Festival)కు జల్లికట్టు(Jallikattu) ఉత్సవాలకు పేరుపొందిన తమిళనాడు(Tamilanadu)లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. తమిళనాడులోని మధురై(Madurai)లో ఈసారి భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. దాదాపు 1100 ఎద్దులతో నిర్వహిస్తున్న ఈ ఉత్సవంలో 600 మంది యువకులు పాల్గొంటున్నారు. కాగా ప్రభుత్వం ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లను ఏర్పాటు చేసింది. దాదాపు 3 వేల మంది పోలీసులతో పర్యవేక్షణ ఏర్పాటు చేయగా.. వైద్య బృందాలను, పదుల సంఖ్యలో అంబులెన్సులను శిబిరం వద్ద ఉంచింది. అయితే ఉత్సవాల్లో ఎదులకు కట్టిన పలకలు పట్టుకునే ప్రయత్నంలో 26 మంది యువకులకు గాయాలయ్యాయి. వీరందరికి వైద్య శిబిరాల్లో చికిత్స అందిస్తున్నారు. అదేవిధంగా ఉత్సవాలను తిలకించేందుకు భారీగా ప్రజలు తరలి వచ్చారు. సినీతారాలు, రాజకీయ ప్రముఖులు కూడా జల్లికట్టు ఉత్సవాలను తిలకించేందుకు తరలి వచ్చారు.

Advertisement

Next Story

Most Viewed