వరంగల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. స్వతంత్ర వేడుకల్లో కొండా సురేఖ

by Nagam Mallesh |
వరంగల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. స్వతంత్ర వేడుకల్లో కొండా సురేఖ
X

దిశ, హన్మకొండః హన్మకొండ జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ దర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ముఖ్యతిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా ప్రగతికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి తిలకించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ వేడుకల్లో వరంగల్‌ పార్లమెంటు సభ్యులు కడియం కావ్య, వరంగల్లు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు రాజేందర్‌ రెడ్డి, నగర మేయర్‌ గుండు సుధారాణి జిల్లా కలెక్టర్‌ శ్రీ పి.ప్రావిణ్య, పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌షూ, నగర పాలక సంస్థ కమిషనర్‌ అశ్వనీతానాజీ వాకాడే ,అదనపు కలెక్టర్‌ వెంకట్‌ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సిబ్బంది, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed