రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళిక.. సీపీ రంగనాథ్

by Javid Pasha |   ( Updated:2023-01-04 13:49:55.0  )
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళిక.. సీపీ రంగనాథ్
X

దిశ, హన్మకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఇటీవల కాలంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో కమిషనర్ ప్రమాదాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా భీంపల్లి క్రాస్ రోడ్డులో పోలీస్ కమిషనర్, పోలీస్ అధికారులు, ఆర్అండ్ బీ స్థానిక ప్రజా ప్రతినిధులతో కల్సి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సి చర్యలపై పోలీస్ కమిషనర్ అధికారులతో చర్చించడంతో పాటు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా వాహనాల వేగాన్ని తగ్గించేందుకుగాను స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు, సెంట్రల్ లైటింగ్, సైన్ బోర్డు భీంపల్లి క్రాస్ వద్ద డివైడర్ల ఏర్పాటు చేయడంతో పాటు, సర్వీసు రోడ్ నుండి ప్రధాన రోడ్లు కలిపే సర్వీసు రోడ్లపై సైతం డివైడర్ల ఏర్పాటు చేయాల్సిందిగా కమిషనర్ ఆదేశించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో రోడు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక ఇంజనీరింగ్ విభాగం ఏర్పాటు చేయడం జరిగిందని, తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ఈ విభాగం పరిశీలించి రోడ్డు ప్రమాదాలకు గల కారణాలు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలుపై ఈ విభాగం అధికారులు నివేధిక అందజేస్తారని చెప్పారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, రోడ్డు భవనాల డీఈఈ గౌస్, కమాలాపూర్ ఇన్స్ పెక్టర్ సంజీవ్, ఇంజనీరింగ్ విభాగం ఇన్స్ పెక్టర్ విజయ్ కుమార్, ఎస్ఐలు సతీష్, చరణ్, సర్పంచ్ లు దేవేందర్ రావు, తిరుపతిరెడ్డి, ఉప్పల్ ఎంపీటీసీ సంపత్ రావు, పీఏసీఎస్ చైర్మెన్ సంపత్ రావుతో ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed