- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ పార్టీ నాయకులతోనే నాకు ప్రాణహాని - వేలేరు ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్
దిశ, వేలేరు: బీఆర్ఎస్ పార్టీ నాయకులతోనే నాకు ప్రాణహాని ఉందని వేలేరు ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్ ఆరోపించారు. మంగళవారం వేలేరు మండలంలోని పీచర గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..... మండలానికి చెందిన ఓ మహిళా ప్రజాప్రతినిధి, వేలేరు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీలు నాపై రౌడీ షీట్ ఓపెన్ చేయకపోతే పోలీసు స్టేషన్ కు తాళాలు వేస్తామని పోలీసులను బెదిరించింది నిజం కాదా అని ప్రశ్నించారు. నిన్న జరిగిన గ్రామ సభలో మహిళా ఎంపీటీసీకి ఇంటి స్థలం ఏ ప్రాతిపదికన ఇస్తున్నారని ప్రశ్నించానని, ఆమెతో పాటు గ్రామంలోని వితంతువులకు, ఒంటరి మహిళలకు ఇంటి స్థలం లేని అందరికీ స్థలం ఇవ్వాలని మాట్లాడినట్లు తెలిపారు.
నేను ఎంపీటీసీ కి సంబందించిన ఖాళీ స్థలం కబ్జా చేశాననే ఆరోపణలు నిజం కాదని, ఆ ఫ్లాట్ ను ఎంపీటీసీ నే కబ్జా చేయడానికి ప్రయత్నం చేయగా ఆ ప్లాట్ తనదని యాజమాని కోర్టు కు వెళ్లగా కోర్టు యాజమానికే అనుకూలంగా తీర్పు ఇచ్చిందని దానికి నాకేం సంబంధమని ప్రశ్నించారు. ఎవరైనా ప్రజాప్రతినిధిగా గెలిచినప్పుడు ప్రజలకు సేవ చేయాలని, తమ స్వంత లాభం కోసం పదవులను అడ్డంపెట్టుకుని నీచ రాజకీయాలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఎంపీటీసీకి గురుకుల పాఠశాలలో జాబ్ ఎలా ఇస్తారని, ప్రభుత్వ పాఠశాలలో ఎమైనా ఖాళీలు ఉంటే నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు తీసుకుని అర్హులైన అభ్యర్థికి ఇస్తారని, కానీ వేలేరు గురుకుల పాఠశాలలో నిబంధనలు గాలికి వదిలేసి ఎంపీటీసీ కి జాబ్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
ఎంతో మంది నిరుద్యోగులు ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే ఎంపీటీసీకి జాబ్ ఇవ్వడం లో ఆంతర్యం ఎమిటో చెప్పాలని బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. ఎంపీటీసీ జ్యోతి చేసిన ఆరోపణలు వాస్తవాలు కాదని సాక్ష్యాదారాలు ఉంటే నిన్ననే విలేకరుల సమక్షంలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నేను ఎంపీటీసీని ఎక్కడ కూడా కులంపేరుతో దూషించలేదని, ఏం మాట్లాడిన సర్పంచ్ మాధవరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రవి, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గ్రామసభలోనే మాట్లాడినట్లు తెలిపారు. ఎంపీటీసీ జ్యోతి కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ మారిన కూడా మేము ఏనాడూ ఎలాంటి విమర్శలు చేయలేదని తెలిపారు. మీపై ఎప్పుడైనా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఆధారాలతో సహ నాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు సుభాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి సంపత్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షురాలు గాజుల రజని, ఓబిసి సెల్ మండల అధ్యక్షుడు మిలుకూరి మధుసూదన్, మండల నాయకులు లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.