గులాబీమయమైన వర్దన్నపేట నియోజకవర్గ కేంద్రం..

by Kalyani |
గులాబీమయమైన వర్దన్నపేట నియోజకవర్గ కేంద్రం..
X

దిశ, వర్ధన్నపేట(పర్వతగిరి): బీఆర్ఎస్ 23వ ఆవిర్బావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వర్దన్నపేట నియోజకవర్గ పార్టీ ప్లినరీ సమావేశాన్ని వర్దన్నపేట పట్టణ కేంద్రంలోని లక్ష్మి గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు. వర్దన్నపేట నియోజకవర్గ పార్టీ ప్లినరీ సమావేశానికి నియోజకవర్గ పరిధిలోని పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ సభా వేదిక వద్ద బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేసిన అమవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.

అనంతరం ఎమ్మెల్యే పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యే ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానాలను సభా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు సంక్షేమ పథకాల ద్వారా రూ. 2369.77 కోట్ల నిధులను అందించడం జరిగిందని అలాగే నియోజకవర్గ పరిధిలో రూ. 1784.60కోట్లతో అనేక అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులైన మనందరం ముఖ్యమంత్రి కేసీఆర్ కు అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed