3 కేజీల కణితిని తొలగించిన ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు

by S Gopi |   ( Updated:2022-12-27 15:26:22.0  )
3 కేజీల కణితిని తొలగించిన ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు
X

దిశ, వర్థన్నపేట: ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అరుదైన శస్ర్త చికిత్స చేసి మూడు కేజీల కణితిని తొలగించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ నరసింహస్వామి తెలిపారు. మంగళవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన సట్ల హేమలత గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతుండేది. రెండు రోజుల క్రితం వర్థన్నపేట పట్టణ కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులను సంప్రదించి అడ్మిట్ అయింది. ఈ నేపథ్యంలో వైద్యులు ఆపరేషన్ కు సంబంధించిన పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ చేసి కణితిని తొలగించారు. దీంతోపాటు మరో ముగ్గురు మహిళ పేషెంట్లకు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ నరసింహ స్వామి తెలిపారు.

ప్రయివేట్ హాస్పిటళ్లకు ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్ లో ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తూ ప్రజల్లో నమ్మకం కలిగేలా అరుదైన శస్త్ర చికిత్సలు చేయడంతో వర్థన్నపేట ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి అరుదైన ఆపరేషన్లు ప్రభుత్వ హాస్పిటల్ లో చేస్తే ప్రజలకు నమ్మకం కలుగుతుందని, ప్రజలు వైద్యుల పనితీరు పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గర్భసంచి ఆపరేషన్లకు ప్రవేట్ హాస్పిటల్లో రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్లు చేయడంతో రోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆపరేషన్ లో సర్జన్ డాక్టర్ సోమశేఖర్, అనస్థీషియా వైద్యులు రాజ్ కుమార్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సట్ల హేమలత కుటుంబ సభ్యులు ఆస్పత్రి వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed