రేపే రంజాన్..

by Sumithra |
రేపే రంజాన్..
X

దిశ, మహబూబాబాద్ రూరల్ : శనివారం జరగనున్న రంజాన్ పండుగను ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకోనున్నారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక తొర్రూర్ బస్టాండ్ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ రోడ్, నెహ్రూ సెంటర్ తదితర ప్రాంతాలలో రంజాన్ పవిత్ర పండుగను పురస్కరించుకొని జోరుగా అమ్మకాలు కొనసాగాయి. ముఖ్యంగా సేమ్యాలు, ఖర్జూర, కిస్మిస్లు, బాదంపప్పు, జీడిపప్పు తదితర వస్తువులు జోరుగా అమ్మకాలు కొనసాగాయి. అటు కిరాణా షాపుల్లోనూ బట్టలషాపులో కూడా అమ్మకాలు జరిగాయి. సంవత్సరానికి ఒకసారి వచ్చే రంజాన్ పండుగను ముస్లింలు అతి పవిత్రంగా భావించి జరుపుకుంటారు. ఇన్ని రోజులపాటు ఉపవాసాలు చేసి తమ భక్తుని చాటుకుంటారు.

ముస్తాబైన మసీదులు..

పవిత్ర రంజాన్ ని పురస్కరించుకొని మహబూబాద్ జిల్లా కేంద్రంలో పాటు వివిధ గ్రామాల్లో ఉన్న మసీదులు పవిత్ర రంజాన్ ని పురస్కరించుకొని ముస్తాబయ్యాయి. రేపు పవిత్ర రంజాన్ కాబట్టి ముస్లింలంతా ఉదయాన్నే వెళ్లి ప్రార్థన చేస్తారు. మసీదులు విద్యుత్ కాంతులుతో విరజల్లుతుంది. పవిత్ర రంజాన్ ని ఒకరోజు ముందు రావడంతో తెల్లారి పవిత్ర రంజాన్ ను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పండుగను అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. అలాగే జిల్లా కేంద్రంలో పాటు వివిధ గ్రామాల్లో ఉన్న మసీదులో ముస్లిం సోదర సోదరీమణులు కూడా జరుపుకుంటారు.

Advertisement

Next Story