- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా పైనే కత్తులతో దాడి చేశారు..మమ్మల్నే జైలుకు పంపారు.!
దిశ, మరిపెడ : మా పైనే కత్తులు, గొడ్డల్లతో దాడి చేస్తారు. మమ్మల్నే జైలుకు పంపుతారా?ఇదెక్కడి న్యాయమంటూ మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల పోలీస్ స్టేషన్ ఎదుట ఉగ్గంపల్లి గ్రామనికి చెందిన బీసు రమేష్ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన కథనం ప్రకారం… దసరా పండుగ సమయంలో మా పైన కత్తులు, గొడ్డలితో ఓ వర్గం వారు దాడి చేశారని, ఈ దాడిలో బీస్ రమేష్ కత్తిపోటుకు గురి కాగా దుస్స వెంకన్న చేయి విరిగిందని తెలిపారు. కొంతమందికి గాయాలు అయ్యాయని అయినప్పటికీ పోలీసులు మా వాళ్ళనే అరెస్టు చేసి రిమాండ్ చేశారని, దాడి జరిగి 20 రోజులు కావస్తున్న వారిని ఇప్పటికి ఎందుకు పట్టుకోలేదు అంటూ మాకు న్యాయం చేయాలంటూ పురుగుల మందు డబ్బాలతో పోలీస్ స్టేషన్ ఎదుట బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
త్వరలోనే పట్టుకుంటాం- ఎస్సై ఝాన్సీ.!
ఈ దాడి ఘటనలో ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశామని, ఒక వర్గం వారిని రిమాండ్ చేశామని, మరో వర్గం వారిని త్వరలోనే పట్టుకుని రిమాండ్ చేస్తామని ఎస్సై ఝాన్సీ తెలిపారు.