- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కోడి పందెం రాయుళ్ల అరెస్ట్..
దిశ, ఏటూరునాగారం : కోడి పందాలు ఆడుతున్న 7 గురు వ్యక్తులను ఏటూరు నాగారం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై తాజుద్దీన్ కథనం మేరకు ఏటూరు నాగారం మండలం చెల్పక గ్రామ సమీపంలోని చెట్ల వద్ద కొంతమంది కోడిపందాలు ఆడుతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు ఏటూరు నాగారం ఎస్సై తాజుద్దీన్ తన సిబ్బందితో కోడి పందాలు ఆడుతున్న స్థావరాల పై ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో ఏడుగురు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించగా వారిని పట్టుకోవడం జరిగిందని, పట్టుబడిన వ్యక్తులు బోడ శంకర్, చింత రమేష్, పి.హరి, అడ్డూరి సాంబయ్య, సమ్మయ్య, బానయ్య, డోంగ్రి వెంకటేష్ లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మూడు కోడిపుంజులను స్వాధీనం చేసుకొని, రూ.1400 జప్తు చేశారని ఎస్సై తాజుద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది హరీష్, అజయ్, తదితరులు పాల్గొన్నారు.