- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుమానంతో అర్ధరాత్రి భార్యను హత్య చేసిన భర్త
దిశ, మల్హర్: కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో అర్ధరాత్రి భార్య గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ విషాద సంఘటన మల్హర్ మండలం రుద్రారంలో బుధవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మూడెత్తుల రమేష్, లక్ష్మి (30) భార్యాభర్తలు. 15 ఏళ్ల వీరి అన్యోన్య దాంపత్యంలో నాలుగు సంవత్సరాలుగా అక్రమ సంబంధం అనే అనుమానం పెనుభూతమై కలహాలకు దారి తీసింది. గ్రామానికి చెందిన సంగేo సుదర్శన్ అనే వ్యక్తి మృతురాలికి ఫోన్ కొనిచ్చినట్లు దీంతో ఇద్దరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతుందని భర్త రమేష్ మంగళవారం కొయ్యూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
అయితే.. భర్త రమేష్ అక్రమ సంబంధం ఉందని మానసికంగా వేధిస్తూ నిత్యం తనపై దాడి చేస్తున్నాడని అతనిపై మృతురాలు సైతం ఫిర్యాదు చేసింది. దీంతో గ్రామస్తుల సహకారంతో ఎస్సై వడ్లకొండ నరేష్ భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చి కలిసిమెలిసి ఉండాలని సూచించడంతో భర్త రమేష్ భార్యను కాపురానికి తీసుకెళ్లినట్లు తెలిసింది. పోలీసులు, గ్రామస్తులు కౌన్సిలింగ్ ఇచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే భార్యాభర్తల మధ్య మరల వాగ్వాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి భర్త భార్యను హత్య చేసి పోలీస్ స్టేషన్‌లో నేరుగా లొంగిపోయాడు. లక్ష్మి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తన తల్లి చనిపోయిందని కుమారుడు కూతురు కన్నీరుమున్నీరయ్యారు. హత్య జరిగిన విషయం తెలుసుకున్న కాటారం సీఐ రంజిత్ రావు కాటారం, కొయ్యూరు పోలీస్ బృందంతో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.