- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కమీషన్ 'రగడ' .. కొట్టుకున్న హెడ్ కానిస్టేబుళ్లు..!
దిశ, నెక్కొండ : ఫిర్యాదు దారుడి నుండి తీసుకున్న లంచాన్ని సమంగా పంచలేదని ఆరోపిస్తూ ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు కొట్టుకున్న సంఘటన నెక్కొండ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకున్నట్లు సమాచారం. వాటాల్లో వచ్చిన తేడా ప్రధానంగా గొడవకు కారణంగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కొన్ని రోజుల కిందట నెక్కొండ ఎస్సై లీవ్ పై వెళ్లారు. ఈ నేపథ్యంలో స్టేషన్ కి వచ్చే ఫిర్యాదుల బాధ్యతలను ఓ హెడ్ కానిస్టేబుల్ కి అప్పజెప్పినట్లు చర్చ జరుగుతోంది.
ఈ క్రమంలోనే మరో హెడ్ కానిస్టేబుల్ సైతం ఆధిపత్యం చేయడంతో ఇరువురి మధ్య డబ్బుల సమస్య తలెత్తింది. కళ్లెదుటే కమీషన్ పోతుండటంతో ఆగ్రహం చెందిన సదరు హెడ్ కానిస్టేబుల్ తీవ్ర వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఇది కాస్త ముదరడంతో పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాల వేదికగా ఇరువురు కొట్లాటకు దిగినట్లు సమాచారం. అందుబాటులో ఎస్సై లేకపోవడంతో సమాచారం అందుకున్న సీఐ చంద్రమోహన్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు మండల వ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే కమీషన్ల కోసం బహిరంగంగా కొట్టుకోవడం విమర్శలకు కారణమైంది. ఈ ఘటన పై ఉన్నతాధికారులు విచారణ చేసి ఏ మేరకు చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది.