- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కులమతాల మధ్య ఆ పార్టీ చిచ్చుపెడుతుంది

దిశ, ములుగు ప్రతినిధి : కులమతాల మధ్య ఆ పార్టీ చిచ్చుపెడుతుంది అని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా మల్లం పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడా కుల అశోక్ ఆధ్వర్యంలో జరిగిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదానికి రాహుల్ గాంధీ పిలుపునిచ్చారని, అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు దేశ సమాజం క్షమించరానిదన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని క్షేత్ర స్థాయిలో బలంగా తీసుకెళ్లాల్సిన అసవరం ఉందన్నారు.
జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ ఆశయాలకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ విధానాలను రూపొందిస్తుందన్నారు. రాష్ట్రంలో విప్లవాత్మక కార్యక్రమాలు తీసుకోవడం జరిగిందన్నారు. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదం సామాజిక విప్లవం తీసుకువస్తుందన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మంత్రి కోరారు. కార్యకర్తల పోరాట ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఏడాది కాలంలో 53 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేస్తే తప్పకుండా అవకాశాలు వస్తాయని ఇంఛార్జి కైలేశ్ నేత అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు, బ్లాక్, మండల అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.