- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ధోని, విజయ్ శంకర్ పై ట్రోలింగ్..చెత్త ప్లేయర్స్ అంటూ ?

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో... చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు మహేంద్ర సింగ్ ధోని (Ms Dhoni ), 360 డిగ్రీ ప్లేయర్ విజయ్ శంకర్ పై ( Vijay Shankar ) దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ ఇద్దరు బ్యాటర్లు పరమ చెత్తగా బ్యాటింగ్ చేశారని.. దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులే... విజయ్ శంకర్ అలాగే మహేంద్ర సింగ్ ధోని జిడ్డు బ్యాటింగ్ పై మండిపడుతున్నారు. ఈ ఇద్దరు ప్లేయర్ల కారణంగానే ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals) చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK ) దారుణంగా ఓడిపోయిందని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చెన్నై సొంత గడ్డ ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరగగా... దారుణంగా చెన్నై సూపర్ కింగ్స్ టీం ఓడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది చెన్నై సూపర్ కింగ్స్. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 183 పరుగులు చేసింది.
అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో... చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. టాపార్డర్ దారుణంగా విఫలం కావడంతో.. విజయ శంకర్ పై భారం పడింది. అయితే రాకరాక వచ్చిన అవకాశాన్ని విజయ శంకర్... అస్సలు వినియోగించుకున్నట్లే కనిపించలేదని ఫైర్ అవుతున్నారు అభిమానులు. 69 పరుగులు చేసినప్పటికీ... టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు.. విజయ శంకర్ బ్యాటింగ్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు మహేంద్రసింగ్ ధోని చివరలో సిక్స్ లు, ఫోర్లు కొట్టాల్సింది పోగా సింగిల్స్ తీశాడని మండిపడుతున్నారు. ఈ ఇద్దరు ప్లేయర్లు చివరి మూడు ఓవర్లలో అటాకింగ్ చేస్తే... చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించేదని అంటున్నారు అభిమానులు.
DC's Master plan with Vijay shankar 🤣🤣#CSKvsDCpic.twitter.com/RSlruNx1pb
— Harry (@Just_Harryy_) April 5, 2025