ముంపుకు గురికాకుండా చర్యలు చేపట్టండి : జిల్లా కలెక్టర్

by Aamani |
ముంపుకు గురికాకుండా చర్యలు చేపట్టండి : జిల్లా కలెక్టర్
X

దిశ,వరంగల్ టౌన్ : నగరంలోని లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురి కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడేలతో కలిసి కలెక్టర్ జీడబ్ల్యూఎంసీ పరిధి వరంగల్ లోని భద్రకాళి బండ్, గేట్ వాల్ వియర్, రామన్నపేట పెద్ద మోరీ, కాపువాడ చెరువు, ఎనుమాముల ప్రాంతం చిన్న వడ్డేపల్లి చెరువు తదితర నాలాల ప్రాంతాల లో క్షేత్ర స్థాయి లో పరిశీలించి ముంపు నివారణ నిమిత్తం చేపట్టాల్సిన జాగ్రత్త చర్యలపై బల్దియా, ఇరిగేషన్, ఇంజనీరింగ్ తదితర విభాగాల ఉన్నతాధికారులతో చర్చించి పటిష్టంగా ఎదుర్కొనుటకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో అవసరం మేరకు పంపులను ఏర్పాటు చేసుకోవాలని, నాలాలలో ఎప్పటికప్పుడు పూడికతీత చేయాలని, నీరు నిల్వ ఉండకుండా కచ్చ నాళాలు కొట్టి నీటిని పారద్రోలాలని అన్నారు. ప్రమాదకరమైన ప్రాంతాల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో రైన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, ఇంకుడు గుంతలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమాల్లో బల్దియా ఎస్ ఈ కృష్ణారావు, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు, ఇరిగేషన్ డిఈలు రవి కిరణ్, హర్షవర్ధన్, మధుసూదన్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed